నా కల నెరవేరింది
‘బబుల్గమ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు రోషన్ కనకాల. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
‘బబుల్గమ్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు రోషన్ కనకాల. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం రోషన్ కనకాల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘చిన్ననాటి నుంచే నటుడు కావాలనే కోరిక ఉండేది.
నా కల ఈ సినిమాతో నెరవేరింది. నా బాల్యమంతా తాతగారి యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో గడిచింది. దాంతో తెలియకుండానే నటనపై మక్కువ పెరిగింది. లాస్ఏంజెల్స్, పాండిచ్చేరిలలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నా. ‘బబుల్గమ్’ సినిమా కోసం షూటింగ్‌కు ముందే వర్క్‌షాప్ నిర్వహించారు. ఇది నా ఏజ్‌గ్రూప్‌కు సంబంధించిన కథ. దాంతో సహజమైన నటనను కనబరిచే అవకాశం దొరికింది.
దర్శకుడి సలహాలు కూడా నటన విషయంలో బాగా హెల్ప్ అయ్యాయి. ఈ సినిమా కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అందుకే విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలను కలవడం, వారి సలహాలు తీసుకోవడం గొప్ప అనుభూతిని అందించింది.
మా అమ్మనాన్నకు ఈ సినిమా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ చూసి నాన్న ఏడ్చారని అమ్మ నాతో చెప్పింది. ఈ సినిమాలో షర్ట్‌లెస్ సీన్ హైలైట్‌గా ఉంటుంది. ఆ సీన్‌కోసం సిటీ మొత్తం మూడుగంటల పాటు షర్ట్ లేకుండా తిరిగాను. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా నా ప్రతిభను చాటుకోవాలనుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

