యువతకు స్ఫూర్తినిచ్చే కథ
రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్'. రవికాంత్ పేరేపు దర్శకుడు. మానస కథానాయిక. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. రవికాంత్ పేరేపు దర్శకుడు. మానస కథానాయిక. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీబుకింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో అడివి శేష్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ ‘కొడుకు హీరోగా లాంచ్ అవుతుంటే పేరెంట్స్ కళ్లలో ఓ ఆనందం ఉంటుంది. అది సుమ, రాజీవ్ కళ్లలో కనిపిస్తున్నది.
రోషన్ పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అన్నారు. ఈ సినిమాలో రోషన్ నటన చూస్తుంటే కొత్తవాడిలా అనిపించడం లేదని హీరో విశ్వక్సేన్ అన్నారు. రోషన్ కనకాల మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. మనందరి నసీబ్‌లో ఏం రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్లు మార్చుకోవాలి అనే స్ఫూర్తివంతమైన సందేశం ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా ఈ కథ బాగా నచ్చుతుందని, రోషన్ ఈ సినిమాతో పెద్దహీరోగా అవతరిస్తాడని దర్శకుడు రవికాంత్ పేరేపు నమ్మకం వెలిబుచ్చారు. యువతకు సందేశాన్నందించే కథ ఇదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

