Thandel Movie | శరవేగంగా నాగ చైతన్య ‘తండేల్’ షూటింగ్.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన మేకర్స్
Naga Chaitanya | టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Naga Chaitanya | టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండేల్ (Essence Of Thandel) అంటూ గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్స్ ను చిత్రయూనిట్ నెటిజన్లతో పంచుకుంది.. నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ వర్కింగ్ స్టిల్స్‌లో కనిపించారు. ఈ ఫొటోలలో సినిమాలో తీయబోయే సీన్స్ గురించి చందు మొండేటి నాగ చైతన్యతో పాటు అల్లు అరవింద్ కు వివరించే సెటప్ కనిపిస్తోంది. మరోవైపు సాయి పల్లవి ఒక పాపను ఎత్తుకోవడం చూడవచ్చు. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
BTS stills from the sets of #Thandel#NagaChaitanya #SaiPallavi pic.twitter.com/CcebZIeQhb
— Suresh PRO (@SureshPRO_) March 22, 2024
ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లిన నాగ చైతన్య సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అయితే పాకిస్థాన్ జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇక ఇందులోనే కొంచెం ప్రేమ కథ, దేశభక్తి అంశాలు జోడించి కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

