Brochevarevarura | గెట్ రెడీ.. బ్రోచేవారెవరురా క్రేజీ కాంబినేషన్ రిపీట్
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన చిత్రం బ్రోచెవారెవరురా (Brochevarevarura). క్రైం కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీలో (Sree Vishnu)శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా..
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకడు వివేక్ ఆత్రేయ. ఈ దర్శకుడి కాంపౌండ్ నుంచి చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన చిత్రం బ్రోచేవారెవరురా (Brochevarevarura). క్రైం కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీలో (Sree Vishnu)శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా.. సత్యదేవ్, నివేదా థామస్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి మరో సినిమా చేస్తున్నారని తాజా వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం హుషారు ఫేం హర్ష కొనుగంటి (Harsha Konuganti) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ కేరళలో షురూ కానుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూట్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇంతకీ ఈ సారి ఎలాంటి జోనర్లో సినిమా రాబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
యూవీ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నాడు. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. కథాబలమున్న సినిమాలను చేసే యాక్టర్లలో ఎప్పుడూ ముందుంటాడు శ్రీవిష్ణు. ఇక ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతుందనే అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

