Bro Movie Business | మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న బ్రో మూవీ మరో మూడు వారాల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ గంపెడంత ఆశలే పెట్టుకున్నారు. దానికి తోడు మోషన్ పోస్టర్లు, టీజర్లు గట్రా సినిమాపై ఎక్కడలేని హైప్‌ను క్రియేట్ చేశాయి. పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇటివలే పాటలతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతుందని ఇన్సైడ్ టాక్.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ వంద కోట్లు దాటుందని తెలుస్తుంది. ఒక్క ఆంధ్రలో ఏరియాలోనే దాదాపు రూ.40 కోట్ల రేంజ్లో బిజినెస్ జరుగిందట. అది కూడా సీడెడ్ కాకుండా. ఇక ఓవర్సీస్లో రూ.13 కోట్లు డీలింగ్ ఇప్పటికే ఫిక్సయిపోయిందట. నైజాం, సీడెడ్ సహా మిగిలిన ఏరియాలు అన్ని కలుపుకుని మొత్తంగా వంద కోట్ల నెంబర్ అయితే దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఒక రీమేక్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ తెలుగు నేటివిటిని దట్టించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కాస్త మంచి హైప్‌నే తీసుకొచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు ప్లాన్ చేస్తుంది. పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిధరమ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తుంది.