Bro Movie | ఓటీటీల్లోకి వచ్చేసిన బ్రో, బేబి సినిమాలు.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ ఇవే..!
Bro and Baby Movie On Ott | ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. నిర్మాతలు సైతం అదే విధంగా ఓటీటీ సంస్థలతో డీల్‌ను కుదిరించుకుంటున్నారు. తాజాగా బ్రో, బేబి సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి.
Bro and Baby Movie On Ott | ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. నిర్మాతలు సైతం అదే విధంగా ఓటీటీ సంస్థలతో డీల్‌ను కుదిరించుకుంటున్నారు. తాజాగా బ్రో, బేబి సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన బ్రో సినిమా గత అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నాలుగు వారాల కిందట లీజైన బ్రో సినిమాకు టాక్ కాస్త అటు ఇటు వచ్చినా.. ఫ్యాన్స్‌కు కావాల్సిన స్టఫ్ ఉండటంతో ఫస్ట్ వీకెండ్లో విచ్చలవిడిగా కలెక్షన్లు వచ్చి పడ్డాయి.

తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర పవన్ మేనియా ఏంటో మరోసారి స్పష్టమయింది. రీమేక్ సినిమా.. పైగా కమర్షియల్ అంశాలకు తావు లేని సబ్జెక్ట్, అయినా కానీ ఆ రేంజ్ కలెక్షన్లు అంటే మాములు విషయం కాదు. ఫస్ట్ వీకెండ్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసే ఆహా ఓహో అనిపించింది. అయితే వీక్ డేస్‌లో మాత్ర సినిమా చాలా వీక్ అయిపోయింది. మూడు రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఆ తర్వాత ఫుల్‌రన్‌లో పట్టుమని పాతికోట్లు గ్రాస్‌ను కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దానికి తోడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇక ఫైనల్ రన్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోకుండానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది.

ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన బేబి సినిమా అంచనాలకు మించి ఆడింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం. ఇక రెండు వారాలు ఆడిందంటే అది బంపర్ హిట్టే. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి మాత్రం సంచలనం అనే మాటను కూడా దాటుకొని వెళ్లింది. పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.90 కోట్ల మార్కును దాటేసింది. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఆ నమ్మకమే నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు గురువారం సాయంత్రం నుంచే సినిమా అందుబాటలో ఉండగా.. ఆహా సబ్స్రైబర్లకు గత అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

