Brahmastra First Single | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘బ్రహ్మస్త్ర’ ఒకటి. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తెలుగులో బ్రహ్మస్త్రం పేరుతో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో దర్శక దిగ్గజం రాజమౌళి విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. నాగార్జున కీలకపాత్రలో నటించడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్ ‘కేసరియా’ సాంగ్‌ను జూలై 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెండు నెలల క్రీతమే ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తెలుగులో ‘కుంకుమల’ అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తెలుగు ప్రోమో కూడా యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.