Brad Pitt: హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ఇంట్లో భారీ చోరీ
Brad Pitt: బ్రాడ్ పిట్ ఇంట్లో చోరీ జరిగింది. లాస్ ఏంజిల్స్ ఉన్న ఆ ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్1 చిత్రం ఇవాళ రిలీజ్ అవుతోంది.
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్(Brad Pitt) ఖరీదు చేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. లాస్ ఏంజిల్స్ ఉన్న ఆ ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడినట్లు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని లాస్ ఫెలిజా ప్రాంతంలో ఆ ఇళ్లు ఉన్నది. 2023లో ఆ ఇంటిని బ్రాడ్ పిట్ కొన్నట్లు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. అయితే బ్రాడ్ పిట్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ఎఫ్1 ప్రీమియర్ టూర్లో ఉన్నారు. లండన్‌లో ఆ ఫిల్మ్ ప్రీమియర్ సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లారు. మరో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, ఫార్ములా వన్ డ్రైవర్ లివిస్ హామిల్టన్ కూడా ఆ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. చోరీ జరిగిన సమయంలో బ్రాడ్ పిట్ ఇంట్లో ఉన్నాడా లేదా, లేక చోరీకి గురైన వస్తువుల విలువ ఎంత అన్న విషయాన్ని లాస్ ఏంజిల్స్ పోలీసులు వెల్లడించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

