బొమ్మల కొలువు కథ

రిషికేష్, ప్రియాంకశర్మ, మాళవికా సతీషన్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మల కొలువు’. సుబ్బు వేదుల దర్శకుడు. ఏ.వి.ఆర్ స్వామి నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి విడుదలచేశారు. అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ ‘సినిమాల పట్ల ఎంతో ఇష్టం, తపన ఉన్న వ్యక్తుల్లో సుబ్బు ఒకరు. ‘రాహు’ సినిమాతో ప్రతిభను చాటిన అతడు ఈ చిత్రంతో దర్శకుడిగా మరో మెట్టు ఎదగాలి’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నగరంలో వరుసగా అమ్మాయిలు తప్పిపోతుంటారు. ఈ కిడ్నాప్‌ల వెనకున్న ముఠాను ఓ యువకుడు ఎలా పట్టుకున్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం’ అని చెప్పారు. ఇందులో తాను రుద్ర అనే పాత్రను పోషించినట్లు రిషికేష్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

