తమిళ నటుడు విజయ్ ఇంటికి సంబంధించి మరోసారి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో పలు మార్లు ఆయన ఇంట్లోబాంబ్ ఉందంటూ రాంగ్ కాల్స్ వచచాయి. తాజాగా విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్టు చెన్నై నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో నీలాంగరై పోలీసులు బాంబ్ స్క్వాడ్ అందరు కలిసి ఇంటిని తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి చెందిన భువనేశ్వర్ అనే మతిస్థిమితంలేని యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్లు విచారణలో తెలిసింది. అతను గతంలో కూడా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లల్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం విజయ్ బీస్ట్ అనే సినిమా చేస్తుండగా, ఇందులో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక షాపింగ్ మాల్లో హైజాక్ అయిన ప్రజలను తన టీమ్‌తో కాపాడబోయే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి