Dunki Movie | ‘డంకీ’తో షారుఖ్ హ్యాట్రిక్ హిట్ కొడతాడు : బోమన్ ఇరానీ
Dunki Movie | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు.
Dunki Movie | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు. జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. రీసెంట్గా విడుదలైన ‘జవాన్’ (Jawan) సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.1140 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’ (DUNKI). మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్ (Munnabhai MBBS). లాగేరహో మున్నాభాయ్ (Lageraho Munnabhai), త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK), సంజు (Sanju) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ (Tapsee) కథనాయికగా నటిస్తుంది. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుండగా.. మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ రాకపోవడం విశేషం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ స్పందించాడు.
దసరా పండుగా సందర్భంగా సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ముంబైలోని తమ కొత్త ఆఫీస్‌ను మంగళవారం ఘనంగా ప్రారంభించింది. ఇక ఈ వేడుకలో బోమన్ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. వేడుక అనంతరం షారూఖ్ ఖాన్ డంకీ సినిమా గురించి మాట్లాడుతూ.. షారుఖ్‌కి ఇది వరుసగా మూడో బ్లక్ బస్టర్ (హ్యాట్రిక్) అవుతుందని అన్నారు. అలాగే డంకీ కామెడీతో పాటు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారు.. అంటూ బోమన్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీపావళి కానుకగా షారుఖ్ డంకీ సినిమా టీజర్ (Dunki Movie Teaser) ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దీపావళికి విడుదల కానున్న సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై 3 (టైగర్ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అటు షారుఖ్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సల్మాన్ ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పుకోవాలి. కాగా దీనిపై అధికారిక సమాచారం కొరకు మరింత సమయం వేచి చూడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

