బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించేందుకు రణ్బీర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు త్వరగా పూర్తి చేసి, కొద్ది రోజుల పాటు కొత్త సినిమాలేవీ ఒప్పుకోకుండా..పుట్టబోయే బిడ్డను చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. బిడ్డ బాగోగులు చూసుకునేందుకు షూటింగ్ల నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాడు రణ్బీర్.
అటు ఆలియా భట్ కూడా ప్రెగ్నెన్సీ వల్ల రెండు సినిమాల షూటింగ్స్ మధ్యలోనే వదిలేసింది. వీటిలో దర్శకుడు కరణ్ జోహార్ రూపొందిస్తున్న ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ సినిమాతో పాటు సంజల్ లీలా భన్సాలీ ‘బైజు భవరా’ అనే మూవీ ఉంది. ఆలియా ఈ సినిమాలను పూర్తి చేసి వచ్చేప్పటి దాకా బిడ్డ సంరక్షణ బాధ్యతలు రణ్బీర్ వహిస్తాడని ఈ స్టార్స్ సన్నిహితులు తెలిపారు. రణ్బీర్ కపూర్ ప్రస్తుతం సందీప్ వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ చిత్రంలో నటిస్తున్నాడు.