Samrat Prithviraj On OTT | బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీ షెడ్యూల్‌తో ఉంటాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ బాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. బడ్జెట్లో సగం కలెక్షన్లను కూడా రికవరి చేయలేకపోయింది. కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ నటన వర్ణనాతీతం. పృథ్వీరాజ్ పాత్రలో అక్షయ్ జీవించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని జూలై 1నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అక్షయ్‌కుమార్‌కి జోడీగా మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్, సోనూసూద్ కీలకపాత్రలో నటించారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు.