Ramayana | రెండు భాగాలుగా ‘రామాయణ’.. సీతగా సాయిపల్లవి
రణబీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ తాలూకు తాజా అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2026 దీపావళికి తొలిభాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
Ramayana | రణబీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ తాలూకు తాజా అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2026 దీపావళికి తొలిభాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ కొద్దిమాసాల క్రితమే ముంబయిలో మొదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
తాజా అప్డేట్తో ఈ సినిమా నిర్మాణంపై ఓ స్పష్టత వచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంస్థతో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఏ.ఆర్.రెహమాన్‌తో పాటు హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ ఈ చిత్రాన్ని సంగీతాన్నందించబోతున్నారు. ఈ సినిమాలో రావణ పాత్రలో నటిస్తున్నట్లు కన్నడ అగ్ర నటుడు యష్ ఇటీవలే ప్రకటించారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్, కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో వేసిన భారీ సెట్లో జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

