ైస్టెలిష్ గూఢచారి
నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ నటించిన చిత్రమిదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ‘పఠాన్’ నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ నటించిన చిత్రమిదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లో వాడే ఆయుధాలను ప్రత్యేకంగా డిజైన్ చేశామని చెప్పారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘భారతీయ ఫ్యాషన్ ట్రెండ్‌ను ప్రభావితం చేసిన అతికొద్ది మంది హీరోల్లో షారుఖ్‌ఖాన్ ఒకరు.
వివిధ సినిమాల్లో ఆయన ధరించిన దుస్తులు, ైస్టెలిష్ లుక్స్, మేనరిజమ్స్ పట్ల యువత ఎంతగానో ఆకర్షితులయ్యారు. వెండితెరపై రియల్ హీరోయిజానికి చిరునామాగా షారుఖ్‌ఖాన్ నిలుస్తారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ‘పఠాన్’ చిత్రంలో షారుఖ్ లుక్‌ను కొత్తగా తీర్చిదిద్దాం’ అని చెప్పారు. దీపికా పడుకోన్, జాన్అబ్రహమ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘పఠాన్’ చిత్రంపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

