Sara Ali Khan | అమ్మే నా ధైర్యం.. ఆ విషయం నాకు చిన్నప్పుడే అర్థమైంది: సారా అలీఖాన్
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కెరీర్లో ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్తున్నది. ఆమె నటించిన ‘మర్డర్ ముబారక్' సినిమా ఓటీటీలో మంచి హిట్ సాధించింది.
Sara Ali Khan | బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కెరీర్లో ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్తున్నది. ఆమె నటించిన ‘మర్డర్ ముబారక్’ సినిమా ఓటీటీలో మంచి హిట్ సాధించింది. తాజాగా ఆమె ‘యే వతన్ మేరే వతన్’ చిత్రంలో నటిస్తున్నది. నటుడు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ముద్దుల కూతురు సారా బాల్యం ఆడిందే ఆటగా ఏం సాగలేదు. సైఫ్, అమృత విడిపోవడంతో ఆమె తల్లి దగ్గరే ఎక్కువగా పెరిగింది.

‘నా ధైర్యం మా అమ్మే! సింగిల్ మదర్‌కు ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని అమ్మ అధిగమించి, నన్ను పెంచిన తీరు అబ్బురమనిపిస్తుంటుంది. అమ్మ పెంపకంలో నేను ఇండిపెండెంట్‌గా పెరిగాను. మన కోసం ఎవరో వచ్చి, ఏదో చేస్తారని అనుకోవద్దని చిన్నప్పుడే అర్థమైంది. నా ధైర్యానికి కారణం అమ్మే!’ అని చెప్పుకొచ్చింది సారా. పరిస్థితులకు తగ్గట్టుగా ఉండగలగడం చెప్పినంత తేలిక కాదంటుందామె. ‘చాలాసార్లు మనం అనుకున్నట్టుగా ఏదీ జరగకపోవచ్చు. అలాంటప్పుడు చాలా కోపం, చిరాకు కలుగుతాయి. కానీ, ఒక సమస్యను మనం చూసే కోణాన్ని బట్టి దాని పరిష్కారం ఉంటుంది. ఆ పరిస్థితులను అర్థం చేసుకునే శక్తియుక్తులు అమ్మ దగ్గరే నేర్చుకున్నాను’ అంటుంది సారా అలీఖాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

