బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
Vikram Gokhale | బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే (77) ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన..
పుణె: బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే (77) ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశారు.
అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కొన్ని గంటలపాటు బాలగంధర్వ్ రంగమంచ్‌లో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పుణెలోని వైకుంఠ సంశన్ భూమిలో అయనకు అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. అంతకుముందు గురువారమే ఆయన మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. అజయ్‌దేవగన్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోని, జావెద్ జాఫెరీ ట్విటర్లో సంతాపం కూడా తెలిపారు.
దాంతో విక్రమ్ గోఖలే కుమార్తె, ఆస్పత్రి వైద్యులు మీడియా ముందుకు వచ్చి ఆయన బతికే ఉన్నారని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన మరణించారు. గోఖలే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పలు మరాఠీ, బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 1990లో అమితాబ్ హీరోగా వచ్చిన అగ్నిపథ్, 1999లో సల్మాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ జంటగా నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్ తదితర సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

