Ranbir Kapoor | ‘షంషేరా’ నుండి లీకైనా రణ్‌బీర్ ఫస్ట్‌లుక్.. గుబురు గడ్డంతో ఆసక్తికరంగా పోస్టర్!
Ranbir Kapoor First Loook Poster Leaked | బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకు ఈయన నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. అయినా కాని తెలుగు ప్రేక్షకులలో రణ్‌బీర్‌పై ఎనలేని అభిమానం ఉంది. ఇటీవలే వైజాగ్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్లో అది రుజువైంది కూడా. రణ్‌బీర్ కూడా తెలుగు ప్రేక్షకులు తనను అంతగా ఆధరిస్తారని అనుకొలేదని స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సంజూ’ తరువాత దాదాపు నాలుగేళ్ళకు ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో బాలీవుడ్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం నుండి రణ్‌బీర్ పోస్టర్ లీక్ అయ్యింది.
ఈ పోస్టర్లో రణ్‌బీర్ గుబురు గడ్డంతో, చేతిలో గొడ్డలి పట్టుకుని ఇంటెన్సీవ్ కళ్లతో చూస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై తీవ్ర ఆసక్తిని పెంచుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియోలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణీ కపూర్లు కీలకపాత్రల్లో నటించారు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదలకానుంది. దీనితో పాటుగా ఈయన నటించిన ‘బ్రహ్మాస్త్రం’ కూడా ఇదే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం రణ్‌బీర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

