Nitin Manmohan | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నితిన్ మన్మోహన్ (62) గురువారం ఉదయం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 3వ తేదీన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నవీ ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. నితిన్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నితిన్ మన్మోహన్.. బోల్ రాధా బోల్, ఆర్మీ, షూల్, లవ్ కేలియే కుచ్ భీ కరేగా, దస్, రెడీ వంటి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.