సూర్యకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బిజేపీ.. !

తమిళ హీరో సూర్య ఈ మధ్య ఎందుకో కానీ చాలా సార్లు వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. గతేడాది తన భార్య జ్యోతికతో పాటు తన సినిమాను కూడా నేరుగా ఓటిటిలో విడుదల చేసి థియేటర్స్ యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు బర్నింగ్ ఇష్యూస్ మీద మాట్లాడి కాంట్రవర్సీ అయ్యాడు. ఇప్పుడు మరోసారి కూడా ఇదే జరుగుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై తమిళ హీరో సూర్య అభ్యంతరాలు వ్యక్తం చేసాడు. దాంతో అధికార పార్టీ ఆయనపై మండి పడింది. బిజేపీ నాయకులు సూర్యపై ఫైర్ అవుతున్నారు.
మరోవైపు ఈ చట్ట సవరణ భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని సూర్య అభిప్రాయపడ్డాడు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కోసమే చట్టాలు చేయాలని.. అంతేకానీ ఉన్న స్వేచ్ఛను నాశనం చేయడానికి కాదంటూ సూర్య సీరియస్ అయ్యాడు. దాంతో ఇప్పుడు ఈ హీరోపై తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం ఓ సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో సూర్యను టార్గెట్ చేసారు. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం మాట్లాడుతూ సూర్యను సినిమాలు మాత్రమే చేసుకోవాలని సూచించాడు.
ఈ మీటింగ్ తర్వాత సూర్యకు వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్లు. సూర్యకు రాజకీయాలతో అవసరం లేదని.. కేవలం తన సినిమాలు మాత్రమే చేసుకుంటే మంచిదని వాళ్లు చెప్పారు. ఇతర విషయాలపై అనవసర జోక్యం.. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అలా కాదని ఇలాగే రెచ్చిపోతే సూర్యపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ యువజన విభాగం నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వార్నింగ్ పై సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- BJP
- cinematographer
- suriya
RELATED ARTICLES
తాజా వార్తలు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ఆ క్రెడిట్ ప్రభాస్‌కే సొంతం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

