Divyendu Sharma | మున్నా భయ్యాకి బర్త్‌డే విషెస్ తెలిపిన ‘పెద్ది’ టీమ్
Global Star Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.
Global Star Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో భారీ పోరాట సన్నివేశాలతో పాటు, చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ దివ్యేండు శర్మ(మున్నా భయ్యా) ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన బర్త్‌డే కావడంతో చిత్రయూనిట్ అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో దివ్యేండు శర్మ రాంబుజ్జి అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది.
Team #Peddi wishes its ‘RamBujji’ aka the supremely talented @divyenndu a very Happy Birthday ❤🔥
‘RamBujji’ will be one the most interesting characters from the raw & rustic world of #Peddi 💥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026 💥💥
Global Star @AlwaysRamCharan… pic.twitter.com/xZuCGfg4YW
— Suresh Kondeti (@santoshamsuresh) June 19, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

