కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార (Bimbisara) బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. వశిష్ట డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో వచ్చే కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతాయి. ఇంతకీ ఈ సంభాషణలు రాసిందెవరో తెలుసా..? వాసుదేవ్ (Vasudev). బింబిసారకు అదిరిపోయే సంభాషణలు రాసిన వాసుదేవ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథ సిద్దం చేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
దీని గురించి వాసుదేవ్ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..నాకు భగత్ సింగ్ (Bhagat Singh) అంటే ఎంతో అభిమానం. భగత్ సింగ్ చిన్నవయసులోనే హత్యకు గురై ఉండకపోతే స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన ఎలా జీవించి ఉండేవాడో, ఉద్యమంలో ఎలా ముందుకెళ్లేవాడోననే విషయాలకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్దం చేశా. భగత్ సింగ్ పాత్రకు ప్రభాస్ పర్ఫెక్టుగా షూట్ అవుతాడని భావిస్తున్నా. నా దగ్గర ఉన్న కథను ఏదో ఒక రోజు ప్రభాస్‌తో సినిమాగా తీయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
మరి బింబిసార డైలాగ్ రైటర్ వాసుదేవ్ ఆకాంక్ష రానున్న రోజుల్లో నెరవేరుతుందా..? లేదా..? అనేది చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్టు k, ఆదిపురుష్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.