Nandamuri Kalyan Ram | యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా కల్యాణ్‌రామ్ 21వ చిత్రం
అగ్ర హీరో కల్యాణ్‌రామ్ శుక్రవారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 21వ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
Nandamuri Kalyan Ram | అగ్ర హీరో కల్యాణ్‌రామ్ శుక్రవారం జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 21వ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని, ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. పోస్టర్లో కల్యాణ్‌రామ్ ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. విజయశాంతి ఐపీఎస్ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సోహైల్‌ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్నందిస్తున్నారు.
‘బింబిసార’కు ప్రీక్వెల్
‘బింబిసార’ చిత్రం హీరో కల్యాణ్‌రామ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి అయిన బింబిసారుడిగా ఆయన నటన ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు రెండో భాగం ఉంటుందని గతంలోనే మేకర్స్ వెల్లడించారు.
శుక్రవారం కల్యాణ్‌రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా ప్రీక్వెల్ ప్రకటన చేశారు. దీనికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి’ అనే క్యాప్షన్‌తో ప్రీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఈ ప్రీక్వెల్‌ను అత్యుత్తమ సాంకేతిక హంగులతో తెరకెక్కించబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్నది. త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

