Bigg Boss9 | బిగ్ బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు.. ఒక్కో కంటెస్టెంట్ మైండ్ సెట్ మెల్లగా బయటపడుతుందిగా..!
Bigg Boss9 | బిగ్ బాస్ తెలుగు 9లో 12వ రోజు ఎపిసోడ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ మొదట్లో కంటెస్టెంట్ల గాసిప్‌లతో మొదలైంది. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ కన్నీళ్లు పెట్టుకోవడం హౌజ్‌లో చర్చనీయాంశమైంది. "
Bigg Boss9 | బిగ్ బాస్ తెలుగు 9లో 12వ రోజు ఎపిసోడ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ మొదట్లో కంటెస్టెంట్ల గాసిప్‌లతో మొదలైంది. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ కన్నీళ్లు పెట్టుకోవడం హౌజ్‌లో చర్చనీయాంశమైంది. “నా కోసం ఎవరూ ఏడవలేదు” అని అతను చెప్పడం ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ మాత్రం ఇద్దరు కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. మరోవైపు రీతూ చౌదరీ కూడా భావోద్వేగానికి లోనై ఏడుస్తూ కనిపించింది. ఇక హౌజ్ ఓనర్ కోసం బిగ్ బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో టెనెంట్స్ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసే రౌండ్లు జరిగాయి.
మొదటి రౌండ్లో ఫ్లోరా ఔట్ కాగా, సంజనా స్వయంగా తప్పుకుంది. రెండో రౌండ్లో సుమన్ శెట్టి, మూడో రౌండ్లో రీతూ చౌదరీ, నాల్గో రౌండ్లో తనూజ ఎలిమినేట్ అయ్యారు.ఈ రౌండ్లలో గట్టి పోటీ జరిగింది. ముఖ్యంగా రీతూ–తనూజ మధ్య పోరు కాస్త వివాదంగా మారింది. ఇమ్మాన్యుయెల్ కూడా బలంగా పోరాడినా, చివరికి రాము రాథోడ్ సైలెంట్ స్ట్రాటజీతో గెలిచి ఓనర్‌గా నిలిచాడు. మొదట ఇమ్మాన్యుయెల్‌కు అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పటికీ, చివరికి రామునే ఫైనల్ చేశారు. టాస్క్ సమయంలో రీతూ చౌదరీ వద్ద ఉన్న వస్తువులను ఇతరులు తీసుకోవడంతో ఆమె ఎమోషనల్ అయింది. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, ఫ్లోరా, సంజనా ఈ విషయంపై ఆమెతో వాదనకు దిగారు. చివరకు కన్నీళ్లు పెట్టుకోవడం హౌజ్‌లో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.
తనూజ మాత్రం తనపై కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. “అక్కా అక్కా అని పిలిచినా, సమయానికి ఎవరూ సహాయం చేయలేదు” అంటూ బాధపడ్డ ఆమె ఇకపై సెంటిమెంట్స్ పని చేయవని స్పష్టం చేసింది. కొత్తగా ఓనర్ అయిన రాము గురించి ప్రియా ప్రశంసలు కురిపించింది. “సైలెంట్‌గా ఆడిన నువ్వు చివరికి ఓనర్ అవ్వడం గ్రేట్” అని అభినందించింది. అదే సమయంలో రీతూ గురించి రాము బాంబ్ పేల్చాడు. “ఇద్దరం కలిసి ఆడుదామని చెప్పినా, చివరికి నాకే ఎసరు పెట్టింది” అంటూ కామెంట్ చేశాడు. రీతూ చౌదరీ, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్‌లతో స్నేహంగా గడపడం చూసిన దమ్ము శ్రీజ “ఆమె గేమ్స్ ఆడటానికా? లేక వాళ్లతో ఉండటానికా?” అంటూ ప్రశ్నించింది. మరోవైపు ఇమ్మాన్యుయెల్ కూడా బిగ్ స్టోరీ రివీల్ చేశాడు. “రీతూ రాముని తన కంట్రోల్లోకి తీసుకుంది, అందుకే నేను త్యాగం చేశాను. కానీ ఆమెను ఇక ఫ్రెండ్‌గా చూడడం లేదు” అని అన్నాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ తమ అసలు మైండ్‌సెట్ బయటపెడుతూ ఎపిసోడ్ ముగిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

