Bhagavanth Kesari | ‘భగవంత్ కేసరి’లో మెరిసిన బిగ్‌బాస్ బ్యూటీ రతికా రోజ్
Bhagavanth Kesari | టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించాడు. ఇక ‘F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ లాంటి భారీ డిజాస్టార్ తర్వాత స్టార్ డైరక్టర్ అనిల్ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Bhagavanth Kesari | టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించాడు. ఇక ‘F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ లాంటి భారీ డిజాస్టార్ తర్వాత స్టార్ డైరక్టర్ అనిల్ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి నెలకొన్నది. డప్పు చప్పుళ్లు, బ్యాండ్ వాయిస్తూ థియేటర్ల ముందు బాలయ్య ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి, బిగ్‌బాస్ బ్యూటీ రతికా రోజ్(Rathika Rose) కీ రోల్ ప్లే చేసిందట. దీనిపై రతికా ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు. ఊహించని విధంగా సినిమాలో రతికాను చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక రతికా రోజ్ ఈ సినిమాలో ఎమ్మెల్యేగా నటించిందట. ఎక్కువ సేపు లేకపోయినా.. తన నటనతో ఆకట్టుకుందనే టాక్ నడుస్తోంది. ఆమెను ఇలా చూసిన వాళ్లంతా బిగ్ బాస్ రతికా బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ఇక బిగ్‌బాస్ టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన రతికా రోజ్ నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది. హౌజ్‌లోకి వెళ్లిన మెదట్లో రతిక చురకుగానే ఉండేది. గేమ్‌లు, టాస్క్‌లు గట్రా కూడా బాగా ఆడేది. అప్పుడే సింగర్ రాహుల్‌తో దిగిన ఫోటోలు బయటకు రావడం.. ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని రతిక చెబుతుందని శుభ శ్రీ నామినేషన్లో మాట్లాడటం, అదే టైమ్‌లో రాహుల్ ఇన్‌స్టాలో ఆమెను ఉద్దేశించి పోస్ట్ పెట్టడం వంటివి రతికపై నెగెటీవ్ వైబ్స్ తీసుకొచ్చాయి. దానికి తోడు హౌజ్‌లో లవ్ ట్రాక్స్ నడపడం కూడా ఆమెపై ప్రతీకూల ప్రభావం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడవడం, యావర్‌ను కంటెండర్‌గా, హౌజ్‌మేట్‌గా చూడాలని అతనికి చెప్పి.. కన్ఫెషన్ రూమ్‌లో మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం.. ఇలా అవసరానికి మాత్రమే వాడుకునే లక్షణాలు ఉండటం వంటి పలుకారణాలతో రతిక ఎలిమినేట్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

