Bigg boss 5 7th week nominations | బిగ్ బాస్ 5 తెలుగు మొదలై దాదాపు 45 రోజులు అవుతుంది. ఇన్ని రోజుల్లో ఎవరు ఏంటి అనేది ప్రేక్షకులకి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.. ఎవరు గేమ్ ఆడుతున్నారు.. ఎవరు ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు.. ఎవరు సేఫ్ జోన్లో ఉండాలని ప్రయత్నిస్తున్నారు.. వీటిపై ఆడియన్స్‌కు పూర్తి క్లారిటీ వచ్చేసింది. అందుకే ప్రతివారం నామినేషన్స్ లిస్టు బయటకు వచ్చిన వెంటనే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం క్లారిటీగా చెప్పేస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్స్ మాత్రం చాలా గమ్మత్తుగా జరిగాయి. ఇంత చిన్న కారణాలకు కూడా నామినేట్ చేస్తారా అనే అనుమానం వచ్చేలా ఈసారి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఒకరిపై ఒకరికి పర్సనల్ గా ఉన్న అభిప్రాయాలను నామినేషన్స్‌లో చూపించారు. ఇలా మొత్తంగా ఏడో వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. శ్రీ రామచంద్ర, జశ్వంత్, యాంకర్ రవి, ప్రియ, కాజల్, ఆనీ మాస్టర్, సిరి హన్మంత్ ఈ వారం నామినేషన్లో ఉండగా.. సీక్రెట్ రూంలో ఉన్న లోబో కూడా డైరెక్ట్ నామినేట్ అయ్యాడు.
మరీ ముఖ్యంగా సన్నీ వ్యవహరించిన తీరు ఆడియన్స్‌కు పెద్దగా నచ్చడం లేదు. కుర్చీపై రవి టవల్ ఆరేయడం తనకు నచ్చడం లేదు అనే కారణం చెప్పి నామినేట్ చేసింది ప్రియా. ఆమె ఇంటెన్షన్ అది కాదు అని అక్కడ ఉన్న వాళ్లందరికీ తెలుసు. యాంకర్ రవిని నామినేషన్ లోకి తీసుకురావడానికి ప్రియా ఇంత చిన్న కారణం చెప్పింది. మరోవైపు ప్రియాంక ఒక వాలిడ్ రీజన్ చెప్పి ఆర్జే కాజల్ ను నామినేట్ చేయాలని చూసింది. అయితే తన స్నేహితురాలు కావడంతో ఆమెను సేవ్ చేయడానికి యాంకర్ రవిని అన్యాయంగా నామినేట్ చేశాడు సన్నీ. శ్వేత ఉండుంటే కచ్చితంగా నిన్నే నామినేట్ చేసేది బ్రదర్ అంటూ రవికి చెప్పాడు సన్నీ. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ల కారణం నువ్వు ఎలా చెప్తావు అంటూ సన్నీ పై ఫైర్ అయ్యాడు రవి. అయినా కూడా తను వినలేదు. దాంతో వరుసగా ఏడో వారం కూడా నామినేట్ అయ్యాడు రవి.
ఈ విషయం కచ్చితంగా వీకెండ్ లో నాగార్జున దగ్గరికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ చెత్త కారణం చెప్పిన ప్రియా.. దాన్ని ఒప్పుకున్న సన్నీ ఇద్దరు తప్పు చేశారు. ఈ ఇద్దరికి ఖచ్చితంగా నాగార్జున ముందు పంచాయితీ తప్పేలా కనిపించడం లేదు. అక్కడ ఉన్న కారణం కాకుండా తన వ్యక్తిగత కారణాలతో రవిని నామినేట్ చేసి పెద్ద తప్పు చేశాడని మానస్ చెప్పాడు. మరోవైపు కాజల్ మాత్రం సన్నీని సపోర్ట్ చేస్తుంది. వీళ్లందరూ ఆడిన గేమ్‌లో పాపం రవి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈ సారి నామినేషన్స్ చూసిన తర్వాత కచ్చితంగా నాగార్జున పెద్ద క్లాస్ పీకడం ఖాయంగా కనిపిస్తోంది. చెత్త కారణాలు చెప్పినా నామినేట్ చేస్తే దాని ఫలితం మరోలా ఉంటుందని గత సీజన్స్ లో వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఈసారి కూడా అదే జరిగేలా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nandini Rai: బిగ్ బాస్ బ్యూటీ అందాల ఆరబోతకు ఫిదా అవుతున్న కుర్రకారు
Nagarjuna: ఒక్కొక్కరికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన నాగార్జున
నువ్వు గుంటనక్కవే.. యాంకర్ రవిపై సీరియస్ అయిన నాగార్జున
Rohini: డూప్లెక్స్ ఇల్లు కొనుగోలు చేసిన రోహిణి.. షాక్ అవుతున్న ఫ్యాన్స్