తెలుగు అమ్మాయి నందిని రాయ్ బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన నందిని..తెలుగులో మాయ అనే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’ వంటి చిత్రాలను చేసింది. ఈ సినిమాలు పెద్దగా గుర్తింపు తేని నేపథ్యంలో ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్లో కనిపించింది.
నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతోంది. తాజాగా నందినీ రాయ్ అదిరిపోయే గ్లామర్ ట్రీట్ చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది.బ్లూ కలర్ బికినీలో అందాలు ఆరబోస్తూ యువతని తెగ రెచ్చగొడుతుంది నందిని రాయ్. ఈ అమ్మడి గ్లామర్ షోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. టీనేజ్లోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్ ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అప్పుడే మిస్ ఆంధ్రా అయింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్‌లు కూడా చేసింది.