బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో శనివారం రోజు నాగార్జున బుట్టబొమ్మ డ్యాన్స్ చేస్తూ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం శుక్రవారం ఏం జరిగిందో చూపించారు.జైలులో ఉన్న శ్వేతతో శ్రీరామ్, అనీ మాస్టర్ కొంత సేపు డిస్కషన్స్ పెట్టారు.అనంతరం ఆమెను విడుదల చేయాల్సిందిగా బిగ్ బాస్ కోరాడు. బయటకు వచ్చే సమయంలో రవి ఎదురుగా వస్తుండడంతో ఇంకోసారి నీ మాట వినను అని పేర్కొంది శ్వేత. ఆరు వారాలుగా మన మధ్య గ్యాప్ ఎందుకు వస్తుంది.. ఎందుకు క్లియర్ కావడం లేదని ఒకరినొకరు చర్చించుకొని హగ్గులు ఇచ్చుకున్నారు.
అనంతరం బిగ్ బాస్ హౌజ్‌కి రెండో సారి కెప్టెన్ అయిన విశ్వని స్టోర్ రూంలో ఉన్న కిల్లర్ టెడ్డీని తీసుకురమ్మని నాగ్ ఆదేశించారు. దీంతో ఆ టెడ్డీని తీసుకొచ్చి లోబోకు ఇచ్చాడు విశ్వ. ఇక ఆ తర్వాత అతడిని ఫుల్‌గా క్లాస్ పీకాడు.హౌజ్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయకూడదని తెలియదా, అంటే హానెస్టీగా తెలియదు అన్నాడు. తెలియకుండానే బిగ్ బాస్ హౌస్‌కి వచ్చావా? రూల్స్ తెలియదంటే నీకేం చెప్పాలి? అని అడిగారు నాగార్జున.
లోబోకి గట్టిగానే క్లాస్ పీకిన నాగార్జున ఆ తర్వాత సంచాలక్‌గా ఉన్నప్పుడు ఇంటి సభ్యులు ఏం చెప్తున్నారో ముందు అది వినడం నేర్చుకో.. వినకుండానే రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? అని అన్నాడు. ఇక అనీ మాస్టర్‌కి క్లాస్ పీకి ఆ తర్వాత శ్రీరామ్‌ని నువ్వు నీలానే ఉండు అని అన్నారు. యాక్టర్స్ అంటే నీకు అంత చిన్నచూపా.. నేను జస్ట్ సింగర్‌ని బ్రో.. స్క్రిప్ట్ రాయడం మాటలు ఫ్రేమ్ చేసుకోవడం తెలియదు అని అంటున్నావ్. యాక్టర్స్‌ని చిన్న చూపు చూడకు అంటూ శ్రీరామ్‌కి క్లాస్ పీకారు నాగార్జున.
ఇక కుషన్ కట్ చేయించే విషయంలో శ్వేతకి కూడా గట్టిగానే క్లాస్ పీకాడు. నీకు కుషన్స్ కట్ చేయమని ఐడియా ఇచ్చిన వ్యక్తి (రవి) ఆ పని చేయకుండా నీతో ఎందుకు చేయించాడో అర్థం అయ్యిందా? అని అడగ్గా.. అయ్యింది సర్ అని చెప్పింది. బిగ్ బాస్‌ని మొత్తం చదివేశావ్.. కెప్టెన్ కావడం నీ కల.. బిగ్ బాస్ ప్రాపర్టీకి ఇంత డ్యామేజ్ చేస్తుంటే నువ్ సంచాలక్‌గా ఏం చేశావ్.. అని కాజల్‌ని అడిగారు నాగార్జున. ఇక సన్నీ ఆటని మెచ్చుకున్నారు. షణ్ముఖ్ ఇన్ఫ్లూయెన్స్ కాకపోవడం విషయంలో అతనిపై ప్రశంసలు కురిపించాడు.