Gangs of Godavari | టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). విశ్వక్ సేన్ 11 (VS11)గా వస్తోన్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టులో వచ్చే స్పెషల్ సాంగ్‌లో ఈషా రెబ్బా కనిపించబోతుందని నెట్టింట వార్తలు షికారు చేస్తుండగా.. ఇప్పుడు మరో అప్డేట్ తెరపైకి వచ్చింది.
ఈ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోయేది బిగ్ బాస్ సీజన్ 17 (హిందీ) ఫేం అయేషా ఖాన్ అట. అంతేకాదు విశ్వక్సేన్, అయేషాఖాన్ మధ్య వచ్చే ట్రాక్ నిన్న రాత్రే పూర్తయిందని ఇన్సైడ్ టాక్. 2022లో వచ్చిన తెలుగు సినిమా ముఖచిత్రం ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో నటించింది అయేషాఖాన్. మరి ఈ భామ స్పెషల్ సాంగ్‌లో ఎలాంటి మెస్మరైజింగ్ స్టెప్పులు వేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
ఇటీవలే విశ్వక్ సేన్ ఊరమాస్ అవతార్‌లో చేతిలో పందెం కోడి పట్టుకుని కనిపిస్తున్న కొత్త లుక్ లాంఛ్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
పందెంకోడితో విశ్వక్సేన్..
Team #GangsOfGodavari wishes you all a prosperous and delightful Sankranthi! #HappySankranthi 🌾✨
GANGS OF GODAVARI will arrive in theatres on 8th March, 2024! 💥 pic.twitter.com/2hwbtyUOcf
— VishwakSen (@VishwakSenActor) January 15, 2024
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..
#VishwakSen & #Nehashetty Dance Performance #SuttamlaSoosi Song Launch Event #GangsofGodavari pic.twitter.com/CKHuj7YNbJ
— Suresh PRO (@SureshPRO_) August 16, 2023
Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗
Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ
— Ramesh Bala (@rameshlaus) July 23, 2023