Vedat Marathe Veer Daudle Saat | అక్షయ్ కుమార్ సినిమా సెట్లో ప్రమాదం..! యువకుడి పరిస్థితి విషమం..!
Vedat Marathe Veer Daudle Saat | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’. కొల్హాపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకున్నది. వంద అడుగులు ఎత్తు నుంచి 19 సంవత్సరాల యువకుడు లోయలో ప్రమాదవశాత్తు పడిపోయాడు.
Vedat Marathe Veer Daudle Saat | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’. కొల్హాపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకున్నది. వంద అడుగులు ఎత్తు నుంచి 19 సంవత్సరాల యువకుడు లోయలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. దాంతో తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సినిమా షూటింగ్ శనివారం 8.30 గంటల నుంచి షూటింగ్ ప్రారంభమైంది. కొల్హాపూర్‌లోని పన్హల్గడ్లో సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫొటోగ్రఫీ చేస్తున్న నగేశ్ ఖోబారే అనే యువకుడు నేరుగా వంద అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. ఈ ఘటన సెట్లో కలకలం సృష్టించింది.
వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న కొల్హాపూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అందుకున్న పన్హాలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అయితే, ఇప్పటి వరకు పోలీసులు గానీ, చిత్రబృందం సైతం ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ‘మరాఠా’ చిత్రమైన ‘వేదాత్ మరాఠే వీర్ దౌడు సాత్’ చిత్రానికి మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్ గత కొన్ని రోజులుగా కొల్హాపూర్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా.. జై దుధానే, ఉత్కర్ష్ షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ తర్దే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

