స్వీయ దర్శకత్వంలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాత. కావ్య థాపర్ కథానాయిక. మే 19న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ ఆంటోని భారతదేశ సంపన్నుల్లో ఒకరైన విజయ్ గురుమూర్తి పాత్రలో కనిపించారు.
యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్, కోర్ట్ రూమ్ డ్రామాతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అన్నా చెల్లెళ్ల ఎపిసోడ్ హృదయాలను కట్టిపడేసేలా అనిపించింది. ఈ సినిమాలోని భావోద్వేగాలు, సందేశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని చిత్రబృందం పేర్కొంది. వై.జి.మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.