Bhumika Chawla | భూమిక సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 23 ఏండ్లు అవుతున్నది. ఇప్పటికీ అడపాదడపా ప్రాధాన్యమున్న పాత్రల్లో తళుక్కున మెరుస్తూనే ఉంది. తాజాగా సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కీలక భూమిక పోషించింది. ఇరవై ఏండ్ల కిందట ‘తేరే నామ్’ చిత్రంలో సల్మాన్‌తో నటించిన ఆమె.. అప్పటి సంగతులు గుర్తు చేసుకుంది. ‘తేరే నామ్ షూట్ టైమ్‌లో నేను కాస్త రిజర్వ్‌గా ఉండేదాన్ని. షాట్ గ్యాప్‌లో పుస్తకాలు చదివేదాన్ని. ఇప్పటికీ అంతే అనుకోండి! పుస్తకాలు అంతగా చదవకపోయినా.. సెట్లో అందరితో కలివిడిగా ఉండటం తక్కువే! ప్రైవసీ కోరుకుంటా’ అంటున్నది భూమిక.
రకరకాల పాత్రలు పోషించిన ఈ నటి పూర్తిస్థాయి కామెడీ పాత్రలో కనిపించాలని ఉందంటున్నది. ‘ఫుల్‌లెంగ్త్ కామెడీ పాత్రల కోసం నేను చాలాసార్లు ప్రయత్నించాను! కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. యాక్షన్ సినిమాలకూ నేను న్యాయం చేయగలననే అనుకుంటాను. థ్రిల్లర్ మూవీస్ చేయడం ఇష్టం’ అని చెబుతున్నది భూమిక.