Bhool Bhulaiyaa | భూల్ భులయ్యా 3.. మళ్లీ భయపెట్టేందుకేనా?
ఇప్పుడంతా ఫ్రాంచైజీ సినిమాల జమానానే! ఒక సినిమా ఘన విజయం సాధిస్తే.. అయితే సీక్వెల్‌తో ఆ సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు. అందుకు అవకాశం లేకపోతే ఫ్రాంచైజీ ఫార్ములాను ఎంచుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.
Bhool Bhulaiyaa | ఇప్పుడంతా ఫ్రాంచైజీ సినిమాల జమానానే! ఒక సినిమా ఘన విజయం సాధిస్తే.. అయితే సీక్వెల్‌తో ఆ సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు. అందుకు అవకాశం లేకపోతే ఫ్రాంచైజీ ఫార్ములాను ఎంచుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. ‘చంద్రముఖి’ సినిమాకు రీమేక్ వెర్షన్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సినిమా ‘భూల్ భులయ్యా’. 2007లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘చంద్రముఖి’ డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రానికి ఫ్రాంచైజీ హోదా కట్టబెట్టి 15 ఏండ్ల తర్వాత అనీస్ బజ్మీ దర్శకత్వంలో ‘భూల్ భులయ్యా 2’ విడుదలైంది. టబు, కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వాణి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండో సినిమా కూడా హిట్ కావడంతో మూడో ప్రయత్నానికి ముహూర్తం కుదిరింది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సెట్స్‌కు చేరకముందే దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని ప్రొడక్షన్ టీమ్ చెబుతున్నది. ‘భూల్ భులయ్యా 3’ ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో చూడాలి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

