Bheemla Nayak Collections | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో చూపించిన జోరు వీక్ డేస్ నుంచి చూపించలేకపోయింది. నాలుగవ రోజు నుంచి క్రమ క్రమంగా ఈ చిత్ర కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్‌ను అందుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిన కలెక్షన్లను ఒకసారి గమనిస్తే..
నైజాం : 34.87 కోట్లు
సీడెడ్ : 11.01 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.51 కోట్లు
ఈస్ట్ : 5.68 కోట్లు
వెస్ట్ : 5.08 కోట్లు
గుంటూరు : 5.20 కోట్లు
కృష్ణ : 3.96 కోట్లు
నెల్లూరు : 2.60 కోట్లు
ఏపి+తెలంగాణ : 75.91 కోట్లు (120కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 8.87 కోట్లు
ఓవర్సీస్ : 12.54 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 100.32 కోట్లు (167కోట్ల గ్రాస్)
‘భీమ్లానాయక్’ చిత్రానికి 106 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు 100.32 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. మరో 7.68 కోట్ల షేర్‌ను సాధిస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.