Bhanupriya | మతిమరుపుతో బాధపడుతున్న దిగ్గజ నటి భానుప్రియ
Bhanupriya | దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన, అసాధారణమైన నృత్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ నటి భానుప్రియ (Bhanupriya) ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది.
Bhanupriya | దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన, అసాధారణమైన నృత్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ నటి భానుప్రియ (Bhanupriya) ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది. ఆమె తాజాగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ వివరాలను వెల్లడించడం సినీ అభిమానులను కలచివేస్తోంది. భానుప్రియ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి గల కారణాలను వివరించారు. ఆమె మాజీ భర్త, డిజిటల్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ 2018లో గుండెపోటుతో అకాల మరణం చెందడం తనను తీవ్రంగా కుంగదీసిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా లేదని, జ్ఞాపకశక్తి లోపం కారణంగా నేర్చుకున్న విషయాలు, డైలాగ్‌లు కూడా మర్చిపోతున్నానని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో నేర్చుకున్న నృత్యంపై కూడా ఆసక్తి తగ్గిపోయిందని, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం కూడా మానేశానని ఆమె వివరించారు.
1983లో మెల్ల పెసంగళ్ చిత్రంతో నటిగా పరిచయమైన భానుప్రియ, అనతికాలంలోనే తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ తన ముద్ర వేశారు. చిరంజీవి, నాగేశ్వరరావు, బాలకృష్ణ, వెంకటేష్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్రతారల సరసన నటించి ‘ది మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్’గా వెలుగొందారు. 1998లో ఆదర్శ్ కౌశల్‌ను వివాహం చేసుకున్న ఆమె, 2005లో విడిపోయారు. వారికి అభినయ అనే కుమార్తె ఉంది.
చివరగా ఆమె శివకార్తికేయన్ నటించిన అయలాన్ (2024) చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ, జ్ఞాపకశక్తి సమస్యలతో పోరాడుతున్నారు. అందం, నటన, నృత్యం… ఇలా అన్ని రంగాల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన భానుప్రియ గారి పరిస్థితి ఇప్పుడు అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

