రహస్యాన్ని దాచాను
‘లెనిన్'తో తొలి విజయాన్ని అందుకున్నది పూణే పూబోణి భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్‌తో ‘సెయోన్' సినిమా చేస్తూ బిజీగా ఉన్నది ఈ అందాలభామ.
‘లెనిన్’తో తొలి విజయాన్ని అందుకున్నది పూణే పూబోణి భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్‌తో ‘సెయోన్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నది ఈ అందాలభామ. అలాగే మలయాళంలోనూ ‘ఆపరేషన్ గంగా’ అనే సినిమాలో నటిస్తున్నది. ‘లెనిన్’ విజయంతో భాగ్యశ్రీ డేట్ల కోసం నిర్మాతలు క్యూ కడుతున్నట్టు వినికిడి. ఎంత బిజీగా ఉన్నా షోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ భాగ్యశ్రీ యాక్టీవ్‌గానే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో తాను పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఆ పోస్ట్‌లో తను ఇలా రాసుకొచ్చింది.
‘ఇన్నాళ్లూ నేను దాచిన ఓ రహస్యాన్ని బయటపెట్టే సమయం ఆసన్నమైంది. నేను కవిత్వం రాస్తాను. నా స్నేహితులంతా నా కవిత్వాన్ని మెచ్చారు. వాళ్లు నన్ను కవయిత్రి అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. జీవితంలో ఎదురైన చేదు అనుభవాలే నా కవితలకు ప్రేరణ. కవిత్వం నాకు ప్రశాంతతనిచ్చింది. కవిత్వం రాసే సమయంలో నా హృదయం చెప్పేది మాత్రమే వింటూ ప్రపంచాన్ని మరిచిపోతాను. ఏదో ఒకరోజు నేను బయటకు చెప్పలేని ఎన్నో మాటలను నా కవిత్వం ద్వారా మీ ముందుకు తెస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది భాగ్యశ్రీబోర్సే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

