Bhagyashri Borse | మహర్దశ మొదలైంది.. బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
ఔరా అనిపించే ఔరంగబాద్ అందం భాగ్యశ్రీ బోర్సే బంపర్ ఆఫర్ కొట్టేసింది. తమిళ అగ్ర కథానాయకుడు సూర్య సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మని వరించినట్టు చెన్నై మీడియాలో బలంగా వార్తలొస్తున్నాయి. సూర్య కథానాయకుడిగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది.
Bhagyashri Borse | ఔరా అనిపించే ఔరంగబాద్ అందం భాగ్యశ్రీ బోర్సే బంపర్ ఆఫర్ కొట్టేసింది. తమిళ అగ్ర కథానాయకుడు సూర్య సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మని వరించినట్టు చెన్నై మీడియాలో బలంగా వార్తలొస్తున్నాయి. సూర్య కథానాయకుడిగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఖాయం అయ్యిందట. మే నెలలో షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. తొలి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ ఫలితం ఎలా ఉన్నా.. భాగ్యశ్రీబోర్సే మాత్రం అందంతో మార్కులు కొట్టేసి యూత్‌ని కట్టిపడేసింది. అందుకే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి.
ప్రస్తుతం సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాంత’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నది భాగ్యశ్రీబోర్సే. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్ఘీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేం మహేశ్‌బాబు తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ భాగ్యశ్రీనే కథానాయిక. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కింగ్డమ్’లోనూ భాగ్యశ్రీనే హీరోయిన్. ఈ లైనప్‌ని బట్టి చూస్తుంటే.. ఈ ముద్దుగుమ్మకు మహర్దశ మొదలైందనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

