Bhagyaraj | తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. దశాబ్దాల పాటు తన కథలతో, దర్శకత్వంతో, నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ దిగ్గజ కళాకారుడు గుండెపోటుతో కన్నుమూయడంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినీ వర్గాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. భాగ్యరాజ్ పార్థివ దేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శన కోసం ఆయన నివాసంలో ఉంచారు. ఈ సమయంలో చోటుచేసుకున్న ఓ దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. భాగ్యరాజ్ ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క తన యజమాని పార్థివ దేహం వద్ద తిరుగుతూ కనిపించింది.
శవపేటిక చుట్టూ తిరుగుతూ, తన యజమాని వైపు మౌనంగా చూస్తూ నిలబడిన ఆ మూగజీవి ప్రవర్తన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. తన యజమాని ఇక లేరనే విషయాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఆ కుక్క కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు “జంతువుల విశ్వాసం ఎంతో గొప్పది”, “మాటలతో చెప్పలేకపోయినా ఆ బాధ స్పష్టంగా కనిపిస్తోంది అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలామంది ఆ వీడియోలను షేర్ చేస్తూ ఆ మూగజీవి చూపించిన ప్రేమను ప్రశంసిస్తున్నారు. భాగ్యరాజ్ మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పలువురు నటీనటులు, దర్శకులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భాగ్యరాజ్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని చివరి చూపు చూసారు. దశాబ్దాల పాటు భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా భాగ్యరాజ్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక కుటుంబ వేడుకలో ఉత్సాహంగా కనిపించిన ఆయన ఇలా ఆకస్మికంగా కన్నుమూయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆదివారం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య భాగ్యరాజ్‌కు తుది వీడ్కోలు పలికారు.కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ మరణం చిత్రసీమకు తీరని లోటుగా నిలిచింది.
#WATCH | மறைந்த இயக்குநர் பாக்யராஜின் உடல் வைக்கப்பட்டு இருந்த பெட்டியை சுற்றி சுற்றி வந்த அவரது வளர்ப்பு நாய்#SunNews | #Bhagyaraj | #RIPBhagyaraj pic.twitter.com/rc0SNxnTCM
— Sun News (@sunnewstamil) June 28, 2026