Bhagavanth Kesasri Movie | మా చిచ్చా ఒచ్చిండు.. ఊరమాస్‌గా గణేష్ ఆంథమ్ ప్రోమో..!
Ganesh Anthem | దసరి బరిపై మొదట గురిపెట్టింది భగవంత్ కేసరి సినిమానే. బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ మాస్ ఆడియెన్స్‌లో భీభత్సమైన అంచనాలు నెలకొల్పాయి.
Ganesh Anthem | దసరి బరిపై మొదట గురిపెట్టింది భగవంత్ కేసరి సినిమానే. బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ మాస్ ఆడియెన్స్‌లో భీభత్సమైన అంచనాలు నెలకొల్పాయి. ఇప్పటివరకు మాస్ జానర్‌ను టచ్ చేయని అనిల్ రావిపూడి ఏకంగా మాస్కు నిర్వచనంగా చెప్పుకునే బాలయ్యతో సినిమా చేస్తున్నాడంటే నందమూరి అభిమానులతో సహా సగటు ప్రేక్షకుడిలోనూ అమితాసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇప్పటి నుంచే మేకర్స్ సినిమాపై హైప్ పెంచేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని గణేష్ ఆంథమ్ ప్రొమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
గణపతి బప్ప మోరియా అంటూ సాగే గణేష్ ఆంథమ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. బిడ్డా ఆన్తలేదు.. సప్పుడు గట్టిగా చేయమను అంటూ బాలయ్య డైలాగ్ మాస్ లెవల్లో ఉంది. శ్రీలీల సైతం మా చిచ్చా ఒచ్చిండు కొట్టర కొట్టు అంటూ ఊరమాస్ లెవల్లో డైలాగ్ చెప్పింది. మొత్తానికి ప్రోమోనే ఈ రేంజ్లో ఉంటే సాంగ్ ఇంకా ఎట్లుంటాదో అని నందమూరి అభిమానులు సంబుర పడుతున్నారు. థమన్ ఎప్పటిలాగే మాస్ బీట్‌ను తన రేంజ్లో దంచేశాడు. ఇక ఈ పాట లిరికల్ వీడియో సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.
ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు తమిళ సినిమా లియో రిలీజ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

