Bhagavanth Kesari Movie | బాలయ్య అభిమానులకు క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది..!
Bhagavanth Kesari Songs | దసరా టార్గెట్‌గా రిలీజవున్న భగవంత్ కేసరి సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌లో కూడా తిరుగులేని అంచనాలున్నాయి . ఇప్పటివరకు మాస్ జానర్‌ను టచ్ చేయని అనిల్ రావిపూడి ఏకంగా మాస్కు నిర్వచనంగా చెప్పుకునే బాలయ్యతో సినిమా చేస్తున్నాడంటే అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.
Bhagavanth Kesari Songs | దసరా టార్గెట్‌గా రిలీజవున్న భగవంత్ కేసరి సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌లో కూడా తిరుగులేని అంచనాలున్నాయి . ఇప్పటివరకు మాస్ జానర్‌ను టచ్ చేయని అనిల్ రావిపూడి ఏకంగా మాస్కు నిర్వచనంగా చెప్పుకునే బాలయ్యతో సినిమా చేస్తున్నాడంటే అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా మాములు హైప్ తీసుకురాలేదు. ఏజ్ అయిన కొద్ది బాలయ్య మరింత ఊపుతో సినిమాలు చేస్తున్నాడు. పైగా తన ఏజ్‌కు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోతున్నాడు. ఒకప్పుడు యాభై కోట్ల మార్క్ టచ్ చేయడానికి నానా కష్టాలు పడే బాలయ్య ఇప్పుడు తొలిరోజే యాభై కోట్ల రేంజ్లో వసూళ్లు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ రూ.80 కోట్ల రేంజ్లో ఉందని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా బాలయ్య కెరీర్లో ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ను థమన్ ప్రకటించాడు. త్వరలోనే భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఇక మొన్నామధ్య రిలీజైన గ్లింప్స్‌కు థమన్ ఇచ్చిన మ్యూజిక్కు గూసబంప్స్ అనే మాట కూడా చిన్నదే అనే రేంజ్లో ఇచ్చాడు. ఇక త్వరలో రిలీజ్ కాబోయే పాటకు ఇంకా ఏ రేంజ్లో ట్యూన్ ఇచ్చాడో అని ఫ్యాన్స్ ఊహల్లోకి వెళ్లిపోయారు.
ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు అరవ సినిమా లియో రిలీజ్ అవుతుంది.
#BhagavanthKesari 🦁 1st 🎵
— thaman S (@MusicThaman) August 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

