Bhagavanth Kesari | అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ చేతిలో గన్స్ పట్టుకొని యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు.
‘యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కుటుంబ అనుబంధాలు, వినోదం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. బాలకృష్ణ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని చిత్ర బృందం పేర్కొంది. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.