యథార్థ ఘటనలతో ‘భగత్‌సింగ్ నగర్’

‘నాకు భగత్‌సింగ్ పోరాటపటిమ అంటే ఇష్టం. ఈ దేశమే భగత్‌సింగ్ దేశం అయితే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని. భగత్‌సింగ్ ఎక్కువరోజులు బ్రతికి ఉంటే చేగువేరా అంతటి మనిషయ్యేవారు’ అని అన్నారు అగ్ర నటుడు ప్రకాష్‌రాజ్. బుధవారం హైదరాబాద్‌లో ఆయన ‘భగత్‌సింగ్ నగర్’ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. విదార్థ్, ధృవిక నాయకానాయికలుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో గౌరి, రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ ‘భగత్‌సింగ్ వంటి పోరాటయోధుల్ని మళ్లీ మనకు పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో ఈ సినిమా చేయడం అభినందనీయం. ఇలాంటి దర్శకులకు మద్దతిస్తే సమాజం బాగుపడే చిత్రాలొస్తాయి. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని కోరుతున్నా’ అన్నారు. ‘భగత్‌సింగ్ రాసిన చిన్న లైన్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న యథార్థ ఘటనలతో ఈ సినిమా రూపొందించాను. భగత్‌సింగ్ నగర్లో జరిగే ఓ అందమైన ప్రేమకథ ఇది. వాస్తవికతను ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది’ అని దర్శకుడు తెలిపారు. చక్కటి సందేశాత్మక చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోహీరోయిన్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, నేపథ్య సంగీతం: ప్రభాకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాలాజా క్రాంతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

