Aindrila Sharma | రెండు వారాల కింద బ్రెయిన్ స్ట్రోక్.. నిన్న కార్డియక్ అరెస్ట్.. విషమంగా నటి ఆరోగ్యం
Aindrila Sharma | రెండు వారాలుగా వెంటిలేటర్‌పై ఉన్న ఐంద్రిలా శర్మ ఆరోగ్యం మరోసారి విషమించింది. మంగళవారం (నవంబర్ 15న) గుండెపోటు వచ్చింది. ఒకటి కంటే ఎక్కువసార్లు గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పైనే ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Aindrila Sharma | చందమామ లాంటి రూపం.. చక్కటి అభినయం.. ఇవన్నీ ఆమెను స్టార్‌గా ఒక మెట్టు ఎక్కిస్తే.. విధి ఆమెను కిందకు లాగేసింది. అయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. ధైర్యంగా రెండుసార్లు క్యాన్సర్‌ను జయించింది. కోలుకున్న తర్వాత తన ప్రతిభతో మళ్లీ ఒక్కో అడుగు పైకి ఎక్కుతుంది. ఇంతలోనే మళ్లీ ఆమె మీద విధి పగబట్టింది. ఈసారి బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో దాడి చేసింది. దాన్నుంచి కోలుకునేలోపే గుండెపోటు రావడంతో ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ఇప్పుడు వెంటిలేటర్‌పైనే ఉండి ప్రాణాలతో పోరాడుతోంది. ఆమెనే బెంగాలీ నటి ఐంద్రిలా శర్మ.
బెంగాలీ నటి ఐంద్రిలా శర్మ.. జుమూర్, జియోన్ కాథీ వంటి సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్లో నిలదొక్కుకుంటున్న సమయంలో ఆమె క్యాన్సర్ మహమ్మారి బారిన పడింది. కానీ ధైర్యంగా పోరాడి గెలిచింది. మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టే సమయానికి వ్యాధి తిరగబెట్టింది. సాధారణంగా క్యాన్సర్ తిరగబడితే కోలుకోవడం కష్టమని అంటారు. అయినప్పటికీ మహమ్మారితో ఐంద్రిలా గుండె నిబ్బరంతో పోరాడి గెలిచింది. రెండుసార్లు క్యాన్సర్ నుంచి పోరాడి.. ఇప్పుడిప్పుడే స్థిమితం చెందుతున్న ఆమెను ఈసారి బ్రెయిన్ స్ట్రోక్ కుంగదీసింది. ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఐంద్రిల్లా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో నవంబర్ 1న కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్పటికే శరీరంలో కొంతభాగం పక్షవాతానికి గురైంది. మెదడులో అక్కడక్కడ రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి కూడా వెళ్లింది. ఇలా రెండు వారాలుగా వెంటిలేటర్‌పై ఉన్న ఐంద్రిలా శర్మ ఆరోగ్యం మరోసారి విషమించింది. మంగళవారం (నవంబర్ 15న) గుండెపోటు వచ్చింది. ఒకటి కంటే ఎక్కువసార్లు గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పైనే ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్న ఐంద్రిలా శర్మకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా ఆమె ప్రియుడు సవ్యసాచి చౌదరి (sabyasachi chowdhury ) ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌ను కోరాడు. ఏదైనా అద్భుతం జరిగి.. ఐంద్రిలా ప్రాణాలతో బయటపడాలని వేడుకోవాలని ఫ్యాన్స్‌ను కోరాడు. కాగా.. ఐంద్రిలా శర్మ పరిస్థితి తెలిసిన సెలబ్రెటీలు, ఫ్యాన్స్ ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

