పడవ ప్రమాదంలో బెంగాలీ నటుడి దుర్మరణం
ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ (42) పడవ ప్రమాదంలో దుర్మరణం చెందారు. టెలివిజన్ షో ‘భోలే బాబా పర్ కరేగా’ చిత్రీకరణలో భాగంగా ఒడిశాలోని తల్సరి బీచ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో రాహుల్ బెనర్జీ పడవపై నుంచి అదుపు తప్పి సముద్రంలో పడిపోయారు.
ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ (42) పడవ ప్రమాదంలో దుర్మరణం చెందారు. టెలివిజన్ షో ‘భోలే బాబా పర్ కరేగా’ చిత్రీకరణలో భాగంగా ఒడిశాలోని తల్సరి బీచ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. షూటింగ్ సమయంలో రాహుల్ బెనర్జీ పడవపై నుంచి అదుపు తప్పి సముద్రంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సినిమా యూనిట్ ఆయన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు బాలాసోర్ పోలీసులు తెలిపారు.
‘చిరోదిని తుమీ జే అమర్’ (2008) చిత్రంతో రాహుల్ బెనర్జీ బెంగాలీ పరిశ్రమలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత లవ్ సర్కస్, కాగోజర్ బౌ వంటి చిత్రాలతో పాటు టెలివిజన్ షోలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా బెంగాలీ ప్రేక్షకులకు చేరువయ్యారు. రాహుల్ బెనర్జీ మృతి బెంగాలీ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాహుల్ బెనర్జీ మరణం తనను షాక్‌కు గురిచేసిందని, అద్భుత ప్రతిభావంతుడైన నటుణ్ణి కోల్పోయామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సోషల్‌మీడియా సందేశంలో విచారం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

