‘మా’ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. నామినేషన్ వెనక్కు తీసుకున్న బండ్ల గణేష్
Hyderabad | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా బండ్ల గణేష్ రంగంలోకి దిగారు. అధ్యక్షుడిగా ఎవరిని

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా బండ్ల గణేష్ రంగంలోకి దిగారు. అధ్యక్షుడిగా ఎవరిని గెలిపించినా జనరల్ సెక్రటరీగా మాత్రం తననే గెలిపించాలంటూ జోరుగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్లు పోటీ పడుతున్నాయి.
ఈ రెండు ప్యానెల్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి సమయంలో తొలతు ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ఉన్న బండ్ల గణేష్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జనరల్ సెక్రటరీ పోస్టు కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇప్పుడు అంతే అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
‘‘నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాను’’ అని ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అలాగే తన మద్దతు ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కే ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు.
నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను.🙏 pic.twitter.com/PuIVkdNyDG
— BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

