Bhagavanth Kesari Movie | మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న భగవంత్ కేసరి సినిమాపై జనాల్లో మాములు అంచనాల్లేవు. అనీల్ రావిపూడి దర్శకుడు కాబట్టి విజిల్స్ వేయించే డైలాగ్స్, గూస్బంప్స్ తెప్పించే సీన్లు గట్రా ఉండవేమో అని అందరిలో చిన్న డౌట్ ఉండేది. కానీ టీజర్, ట్రైలర్లు రిలీజయ్యాక.. అసలు సిసలైన బాలయ్య మాస్‌ను ఈ సినిమాలో చూడబోతున్నాం అని ఓ క్లారిటీ వచ్చేసింది. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఏవేవి కోరుకుంటో అవి ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు స్పష్టం అయింది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సైతం రప్పించే కంటెంట్ ఈ సినిమాలో ఉందని అనీల్ హింట్ ఇచ్చేశాడు. దాంతో అందరిలో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక సినిమాకు సంబంధించిన లీకులు ఎక్స్‌పెక్టేషన్స్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లీక్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య ఈ సినిమాలో మరో గెటప్ ఉంటుంది.. అది మీ ఊహకకూడా అందందూ అన్న విధంగా సెకండ్ రోల్ గురించి చెప్పాడు. కాగా తాజాగా సెకండ్ రోల్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు దాదాపు పది నుంచి పదినిమిషాలు పాటు ఆ క్యారెక్టర్ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇదే సెకండ్ గెటప్ అని తెలుస్తుంది.
ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుందని టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పాటు తమిళ సినిమా లియో, కన్నడ సినిమా ఘోస్ట్‌లు రిలీజ్ అవుతున్నాయి.