Balakrishna | ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన ‘వీరసింహా రెడ్డి’
Balakrishna | సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సందడి చేశారు. నందమూరి నటసింహం నటించిన వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమా ఉదయపు
హైదరాబాద్: సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సందడి చేశారు. నందమూరి నటసింహం నటించిన వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమా ఉదయపు ఆటతో రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ‘వీరసింహా రెడ్డి’ బెనిఫిట్ షో ప్రదర్శించారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌తో థియేటర్ నిండిపోయింది. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పులు, బ్యాండ్‌బాజాలతో తమ అభిమానహీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని, వారి స్పందన బాగుందని బాలకృష్ణ చెప్పారు.
సంక్రాంతి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా నేడు వీరసింహా రెడ్డి సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. విదేశాల్లో తెల్లవారుజామున 2 గంటలకే షోలు మొదలయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

