NBK 108 | ఈ సారి పక్కా తెలంగాణ స్టైల్లో బాలకృష్ణ ట్రీట్
త్వరలోనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో ఎన్బీకే 108 (NBK 108) చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఎన్బీకే 108 గురించి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న వారందరికీ వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి.
వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఇక త్వరలోనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో ఎన్బీకే 108 (NBK 108) చేసేందుకు రెడీ అవుతున్నాడు. కామిక్ టచ్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేసే అనిల్ రావిపూడి నెక్ట్స్ చేయబోయే సినిమా ఏ జోనర్లో ఉండబోతుందోనని ఇప్పటికే తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఎన్బీకే 108 గురించి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న వారందరికీ వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. ‘బాలకృష్ణ మామూలు ప్రజలతోపాటు అభిమానులకు కూడా ఆ సినిమా ఎంత బాగా నచ్చాలని జాగ్రత్త తీసుకుంటారు. అందుకే ప్రతీ సినిమాకు ఎన్బీకే టచ్ యాడ్ చేస్తారు. అదే టచ్‌తో వీరసింహారెడ్డి వచ్చింది. ఎన్బీకే టచ్‌తో మళ్లీ 108 కూడా రాబోతుంది. కాకపోతే ఈ సారి అన్న రాయలసీమలో కాదు.. తెలంగాణలో దిగుతుండు.. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తడు.. కలెక్షన్లతో ఖుర్బానీ పెడ్తడు. గెట్ రెడీ’ అంటూ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు అనిల్ రావిపూడి.
ఈ మూవీలో పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

