నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు ఎన్బీకే 107 (Nbk 107). ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బాలయ్య మార్క్ డైలాగ్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. ముందుగా మేకర్స్ ఈ సినిమాలో ఓ పోర్షన్‌ను యూఎస్‌లో చిత్రీకరించాలని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే వీసా చిక్కులతో దర్శకనిర్మాతలు లొకేషన్‌ను మరో దేశానికి మార్చేశారట. ఇంతకీ ఆ లొకేషన్ ఏంటనుకుంటున్నారా..? ఎన్నో అందమైన ప్రదేశాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టర్కీ. అవును బాలయ్య అండ్ టీం టర్కీకి వెళ్లనుందని ఇన్ సైడ్ టాక్. మాస్ ఎలిమెంట్స్ తో రాబోతున్న సినిమా కోసం బాలకృష్ణ టర్కీకి వెళ్తున్నాడన్న అప్డేట్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. మరి లొకేషన్ మార్పు గురించి టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
పక్కా పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruti Haasan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాయలసీమలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ (Duniya Vijay) విలన్‌గా కనిపించబోతున్నాడు.