అమరావతి : తెలుగు ప్రజలకు, అభిమానులకు ప్రముఖ హీరోలు నందమూరి బాలకృష్ణ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ ప్రకాశం జిల్లా కారంచేడులో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. సోదరి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ జనసేన సైనికులకు వీరాభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నం పెట్టే రైతులకు కులం లేదని అటువంటి రైతులకు పార్టీ అండగా ఉంటామని పవన్ పేర్కొన్నారు.